రెహ్మాన్ కోసం పాటపాడనున్న స్టార్ హీరో

రెహ్మాన్ కోసం పాటపాడనున్న స్టార్ హీరో

తమిళ్ స్టార్ హీరోస్‌లో ధనుష్ కూడా ఒకరు. మామ రజనీకాంత్‌ పేరును ఎక్కడ వాడుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.  సహజ నటనతో వేలమంది హృదయాలను దోచుకున్నాడు. సింగర్ గాను తన ప్రతిభను బయటపెట్టి ‘వై దిస్ కొలవేరీ’ అంటూ దేశాన్ని ఊపేశాడు. మల్టీటాలెంటెడ్ హీరోగా కోలీవుడ్‌ను ఏలుతున్న జాబితాలో తనకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. ధనుష్ మరోసారి గాయకుడిగా మారనున్నాడని సమాచారమే కుర్రాలకు పిచ్చెక్కిస్తుంది. దానికి తోడుగా ధనుష్ పాడనున్న కొత్త పాటకు మ్యూజిక్ మాస్టర్ ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు. దాంతో ఈ పాట కోసం వీరిద్దరి అభిమానులు వేచిచుస్తున్నారు. వీరిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను ధనుష్ షేర్ చేశాడు. అందులో ఇద్దరూ మాస్క్‌లు వేసుకొన్ని ఉన్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతానికి ఎందరో గాయకులు పాడిన విషయం తెలిసిందే. అయితే ఈ తమిళహీరో పాడటం ఇదే తొలిసారి కావడం పాటపై ఆసక్తిని మరింత పెంచుతోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్రంగి రే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సారా అలీఖాన్, అక్షయ్ కుమార్‌లు ఇతర పత్రాలు పోషిస్తున్నారు .  రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముగ్గురు అగ్ర నటులు ఓకే సినిమాలో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.