‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ రిలీజ్ కి రెడీ అయ్యాడు!

‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ రిలీజ్ కి రెడీ అయ్యాడు!

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి హీరోగా మారాడు. ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ కథని స్వయంగా అవసరాల శ్రీనివాస్ రాసుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్కనుంది. అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని జనవరి మొదటి తారీఖు లేదా జనవరి 14న గాని తీసుకువచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట.