శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ లుక్

శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ లుక్

పలాస సినిమాతో విమర్శకుల ప్రశంశలు అందుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు శ్రీదేవి సోడా సెంటర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాలో పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు లైటింగ్ పెట్టె కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఇక ఫస్ట్ లుక్ లో బుజం పైన లైట్ లతో చేతిలో సోడా సీసా తో పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు.  ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు.ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు సుధీర్ బాబు ఇటీవల వి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.`వి` చిత్రానికి మిశ్రమ స్పందనలు రాగా సుధీర్ బాబు కాప్ రోల్ కి పేరొచ్చింది. ఈ సినిమా లో సుధీర్ బాబు యాక్టింగ్ కు అభిమానులు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.