లాక్ డౌన్ అనంతరం రికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు !

లాక్ డౌన్ అనంతరం రికార్డ్ స్థాయిలో శ్రీ వారి దర్శనాలు !

కరోనా నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే... ప్రభుత్వాల ఆదేశాలతో దేవాలయాలు తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు వెళుతున్నారు. ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే తిరుమల కొండపైన కూడా మొదటిలాగా భక్తులు ఉండటం లేదు. అయితే నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 56448 మంది అని సమాచారం. తలనీలాలు సమర్పించిన భక్తులు 27323 మంది ఉన్నారు. ఇక హుండి ఆదాయం 3.63 కోట్లుగా ఉంది. లాక్ డౌన్ అనంతరం నిన్నటి రోజున అత్యధిక సంఖ్యలో శ్రీ వారిని దర్శించుకున్నారు భక్తులు. ఇక ఈ 19వ తేదిన రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టిటిడి, ఇక ఉదయం 6.38 నిముషాలుకు శ్రీవారి పాదాలును సూర్యకిరణాలు  స్ర్పుశించినున్నాయి. రథసప్తమి పర్వదినం రోజున సప్తవాహనాలపై భర్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. అయితే దర్శన టోకేన్లు కలిగిన భక్తులును మాత్రమే గ్యాలరిలోకి అనుమతించనుంది టిటిడి. ఇక రథసప్తమి ఏర్పాట్లును సివియస్ఓ గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పరిశిలించారు.