భద్రత కలిపిస్తే టాలీవుడ్ డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తా : శ్రీరెడ్డి

భద్రత కలిపిస్తే టాలీవుడ్ డ్రగ్స్ గుట్టు రట్టు చేస్తా : శ్రీరెడ్డి

వివాదాల నటిగా పేరుతెచ్చుకున్న శ్రీ రెడ్డి .. మరో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చింది. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి  సైలెంట్ గా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ ను డ్రగ్స్ కేసు ఊపేస్తున్న నేపథ్యంలో ఆమె మరోసారి తన నోటిపని చెప్పింది. ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ పేరు రియా చెప్పిందంటూ ప్రచారం జరగడంతో  శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో ఆమె పై విమర్శలు చేసింది అప్పట్లో రకుల్ పత్తిత్తులా మాట్లాడింది అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక టాలీవుడ్ లో కూడా చాలా మంది డ్రగ్స్ తీసుకుంటారని అంటుంది శ్రీరెడ్డి. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. చాలా మంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయం నాకు తెలుసు అని శ్రీరెడ్డి అంటుంది. పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. నాకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానని శ్రీరెడ్డి తెలిపింది.