ఐపీఎల్ 2020: టాస్ గెలిచిన హైదరాబాద్... బ్యాటింగ్ కు కోహ్లీ సేన... 

ఐపీఎల్ 2020: టాస్ గెలిచిన హైదరాబాద్... బ్యాటింగ్ కు కోహ్లీ సేన... 

ఐపీఎల్ లో మూడో మ్యాచ్ ఈరోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  మూడో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడుతున్నాయి.  రెండు జట్లు సమఉజ్జీగా ఉన్నప్పటికీ, బ్యాటింగ్ బౌలింగ్ పరంగా హైదరాబాద్ జట్టు కాస్త బలంగా కనిపిస్తోంది.  ఇక ఇదిలా ఉంటె, హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును తక్కువ స్కోర్ కు కట్టడి చేయాలని హైదరాబాద్ జట్టు చూస్తున్నది.  ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే విషయం మరికాసేపట్లోనే తేలిపోతుంది.