తెలకపల్లి రవి: ప్రాణవాయువు కొరత తీరదా? ఉత్తుత్తి హామీలపై హైకోర్టుల ఆగ్రహం!

తెలకపల్లి రవి: ప్రాణవాయువు కొరత తీరదా? ఉత్తుత్తి హామీలపై హైకోర్టుల ఆగ్రహం!

             ఆక్సీజన్‌ కొరత వల్ల కర్ణాటకలో ఇరవైనాలుగు మంది కరోనా బాధితులు, ఎపిలో ఎనిమిది మంది మరణించినట్టు సోమవారం వార్తలు వచ్చాయి. కొరతకాదు, లో ఫ్రెజర్‌ అని ప్రభుత్వాలు సమర్థించుకుంటున్నా సమస్య తీవ్రత ప్రతిచోటా కనిపిస్తూనే వుంది. ఢిల్లీ పాట్నా మద్రాసు తెలంగాణ ఎపి ముంబై  ఎన్నో హైకోర్టులు, సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా  ప్రజలకు విశ్వాసం కలగడం లేదు. ఒక్క కేరళ మాత్రం ఆక్సీజన్‌ ముందు జాగ్రత్తతో ఉత్పత్తి చేసుకుని పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేసింది. మిగిలిన చోట్ల ఇప్పుడు హడావుడి పెరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఈ సమయంలో ఆక్సీజన్‌ ఉత్పత్తికి ముందుకు వచ్చాయి. విదేశా నుంచి కూడా కొంత ఆక్సీజన్‌ దిగుమతి చేసుకుంటున్నా అది కొంతవరకే సమస్యను అందుకోగలుగుతుంది. పైగా ఆక్సీజన్‌ లభ్యతతో పాటు రవాణా పెద్ద సమస్య, ఇందుకోసం యుద్ధ విమానాను వైమానిక రవాణాను వినియోగిస్తున్నా  పట్టణాలకు చేర్చడానికి రోడ్డు రవాణా తప్పనిసరి. పైగా రాష్ట్రాలకు ఆక్సీజన్‌ కోటాను దూరప్రాంతాలో కేంద్రం కేటాయించినట్టు కనిపిస్తుంది. ఒరిస్సా నుంచి తాము తెచ్చుకోవలసి వుందని ఎపి మంత్రి పేర్ని నాని చెప్పడం ఇందుకో ఉదాహరణ.

         కోవిడ్‌19 వైరస్‌ సోకిన వారికి ఒక్కసారిగా ఆక్సీజన్‌ అవసరాలు పెరిగిపోవడం అనూహ్యమేమీ కాదు. అయితే  కేంద్రం ఈ సమస్యను కాస్తయినా ముందుగా అంచనా వేసి వుంటే తయారు చేసుకోవడం కూడా సాధ్యమై వుండేది. ప్రభుత్వ ఆస్పత్రులకు అది కూడా ఆఖరు నిముషంలో కోవిడ్‌ రోగు వస్తున్న రీత్యా ఆక్సీజన్‌ పెట్టాల్సిన అవసరం బాగా పెరిగింది. అయితే ప్రభుత్వ వైద్శశాలల్లో ఆక్సీజన్‌ ప్టాంట్లు సరైన స్థితిలో లేవు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులో ఆక్సీజన్‌ ప్లాంట్లు వున్నా రోగుల తాకిడి ఎక్కువగా వుంది. చిన్న మధ్య తరహా ప్రైవేటు ఆస్పత్రులో ఈ ప్లాంట్లు వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సరఫరాతో పాటు ప్రెజర్‌సమస్య లీకేజీలు కూడా సమస్యగా మారుతున్నాయి. ఇవన్నీ  ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నాయి.

         అయితే కేంద్రం మాత్రం దేశంలో ఆక్సీజన్‌ సరఫరా బాగానే వుందని హామీ ఇస్తున్నది. ఈ మేరకు హోం శాఖ అదనపు కార్యదర్శి పియూష్‌ గోయల్‌ సోమవారం ఒక ప్రకటన చేస్తూ ప్రజలందరికీ  దీనిపై భరోసా ఇస్తున్నామని అన్నారు. దిగుమతి కూడా జరుగుతుందన్నారు. ఆక్సీజన్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆస్పత్రుల వరకూ రవాణాచేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకోసం ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. వైమానిక దళ విమానాల ద్వారా ఆక్సీజన్‌ టాంకర్లను తరలించి అక్కడి నుంచి తీసుకుపోతామన్నారు. పరిశ్రమలు నైట్రోజన్‌ ప్లాంట్లను కూడా ఆక్సీజన్‌ తయారీ వైపు మరలిస్తామన్నారు. అయితే ఆక్సీజన్‌ సరఫరాలో అనేక సవాళ్లు వున్నాయని ఆరోగ్యశాఖ కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ అంగీకరించారు. ఇంతకూ ఈ ఆక్సీజన్‌ సరఫరాపై ఈ హామీలను ఎంత వరకూ విశ్వసించవచ్చు? ఢిల్లీ హైకోర్టు ఈ రోజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం, దేశ రాజధానికి 700 మెట్రిక్‌ టన్ను ఆక్సీజన్‌ అవసరమని తాము చెబుతుంటే ఇస్తామంటూనే కేంద్రం ఉష్ట్రపక్షిలా ఇసుకలో తలదూర్చి వ్యవహరిస్తోందని కోర్టు అభిశంసించింది.

    రెమిడిస్‌వేర్‌ కొరత లేకుండా చూస్తామనీ, వాక్సిన్‌కు ఆర్డరు ఇచ్చామని 12 రాష్ట్రాల 18 ఏళ్ల వారికి కూడా వాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభించాయని కూడా  కేంద్రం చెబుతున్నది. అయితే  అవి ఎంతకాలం వస్తాయనేది సందేహమే. మిగిలిన రాష్ట్రాలకు సరఫరా ఎప్పుడు జరుగుతుందనే స్పష్టత కూడా లేదు. కోవిడ్‌కు నిజమైన పరిష్కారం వాక్సిన్‌ మాత్రమే అని భావిస్తున్న సమయంలో అదే కొరతగా వుండటం ఆందోళన కలిగిస్తుంది.

           మరోవైపున దేశంలో కోవిడ్‌19 ఉధృతి ఎంతగా వుందంటే 12 రాష్ట్రాలో పాజిటివ్‌ కేసులు 15శాతం పైగా వున్నాయట. మరో తొమ్మిది రాష్ట్రాలలో 5 నుంచి 15శాతం పాజిటివ్‌ రేటు వుంది. మిగిలిన చోట్ల మాత్రం అయిదు శాతం లోపుగావుంది. కరోనా నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారమన్న వాదనలు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ విధించే విషయం ఆలోచించవసిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కొన్నిరాష్ట్రాలో ఇప్పటికే లాక్‌డౌన్‌ అమలవుతుండగా తెలంగాణలోరాత్రికర్ఫ్యూ కొనసాగుతున్నది, ఏపిలో మద్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాలలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నా అప్పుడే  ఎలాంటి నిర్ధారణకు రాగల పరిస్తితి లేదని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. టెస్టులు వేగంగా చేసే అవకాశం లేదంటూ చాలా ఆస్పత్రులో సిటిస్కాన్‌ చేస్తున్నారు గాని ఈ పద్ధతిచాలా ప్రమాదమని ఎయిమ్స్‌ రణదీప్‌ గులేరియా హెచ్చరించారు. ఒక్క సిటి స్కాన్‌ 400 ఎక్స్‌రేల రేడియేషన్‌తో సమానమని ఆయన వివరించారు. కాని మన ఆస్పత్రులలో మాత్రం ప్రాథమిక పద్దతిగానే సిటిస్కాన్‌ను వినియోగించడం ఆందోళనకలిగించక మానదు.