ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే : వార్ మెమోరియల్ దగ్గర నివాళులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే : వార్ మెమోరియల్ దగ్గర నివాళులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా త్రివిధ దళాధిపతులు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం దగ్గర నివాళులర్పించారు. వైమానిక దళం అధిపతి ఆర్ కెఎస్ భదూరియా, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భదూరియా అన్నారు. రాజకీయ నాయకులు ఉగ్రవాదం విషయంలో కఠిన వైఖరి అవలంబించాలన్నారు. సరిహద్దు చొరబాట్లు ఆందోళనకలిగిస్తున్నాయన్నారు. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా వైమానిక దళం చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్మీడే సందర్భంగా బాలాకోట్ హీరోలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సల్యూట్ చేసింది. ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్ లో  87వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వింగ్ కమాండర్ అబినందన్ కు స్క్వాడ్రన్ అవార్డ్ ప్రధానం చేసింది. హిండన్ ఎయిర్ బేస్ లో ఎయిర్ ఫోర్స్ పెరేడ్ లో మూడు మిరాజ్‌ 2000 ఎయిర్ క్రాఫ్ట్, రెండు SU-30MKI ఫైటర్ క్రాఫ్ట్ లను బాలాకోట్ హీరోలు నడిపారు. ఎంఐజీ బైసన్ ను అభినందన్ నడిపారు.