స్పీడ్ పెంచిన "వకీల్ సాబ్" షూటింగ్...
టాలీవుడ్ లో షూటింగుల కళ మళ్లీ మొదలైంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా పట్టాలెక్కుతున్నాయి. పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` ఆల్రెడీ మొదలైపోయింది. పవన్ లేని సన్నివేశాల్ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఇక పవన్ సెట్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం. జస్ట్ 20 రోజుల కాల్ సీట్స్ తో వకీల్ సాబ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.
మరి ఉన్న 20 డేస్ లో ప్యాచ్ తో కలుపుకుని వకీల్ సాబ్ రెఢీ అవుతాడా..?
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూట్ స్పీడ్ పెరిగింది. ఈసారి అనుకున్న టైమ్ కు సినిమాను తేవాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఓటీటీల నుంచి ఎంత ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా పట్టించుకోలేదు.ఎలాగైనా సరే అభిమానుల కోసం థియేటర్లలోకి సినిమాను తీసుకురావాలని చూశారు.అనుకున్నట్లుగానే ఈ డిసెంబర్ లేదా సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.దానిలో భాగంగానే పవన్ జస్ట్ 20 రోజుల సింగిల్ షెడ్యూల్ కు ఈ నెల 26నుంచి హాజరవుతున్నాడు.
పవన్ తన పొలిటికల్ పనులకు కాస్త విరామం ఇచ్చి తన డేట్లు వకీల్ సాబ్ కు ఇచ్చేశాడు. ఈ నెల 26 నుంచి సెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ 20 రోజుల్లో సినిమాను ప్యాచ్ వర్క్ లతో పాటు పూర్తి చేయాలని డిసైడ్ చేశాడు.అందుకు తగ్గట్లుగానే యూనిట్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరికింది.డిసెంబరులోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు
పూర్తి చేసి .. సంక్రాంతికి సినిమాని సిద్ధం చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఈ సినిమా షూట్లో పవన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్లు తీస్తే సరిపోతుంది. ఇందులో ఓ పాట కూడా ఉంది.
20 రోజుల నాన్ స్టాప్ గా షూటింగ్ తో సినిమా పూర్తవుతుంది.ఈ షెడ్యూల్ లో శ్రుతిహాసన్ కూడా పాల్గొననుంది. లాక్ డౌన్ సమయంలో గ్యాప్ రావడంతో.. పవన్ కాస్త ఫ్యాటీ లుక్ లో దర్శనమిస్తున్నాడు. అందుకే.. ఇప్పుడు వెయిట్ తగ్గి, `వకీల్ సాబ్` లుక్ లోకి మారే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఐతే ఈ గ్యాప్ లో పొలిటికల్ గా ఏమైనా కీలక మార్పులు చోటు చేసుకుంటే పవన్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగాల్సి ఉంటుంది. అలాంటివేమి జరగకూడదని దిల్ రాజు కోరుకుంటున్నాడు. ఒకవేల అలాంటివేమైనా జరిగితే మాత్రం సినిమాను సంక్రాంతికి తీసుకురావడం కూడా కష్టమే అవుతుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)