యూనిలివర్ విజయ ప్రస్థానం : ఈ లక్షణంతోనే అగ్రస్థానానికి

యూనిలివర్ విజయ ప్రస్థానం  : ఈ లక్షణంతోనే అగ్రస్థానానికి

ప్రపంచం లో ఉన్న 700 కోట్ల జనాభా లో 97% మంది డైరక్ట్ గానో, ఇన్ డైరక్ట్ గానో యూనిలివర్ కంపనీ ప్రొడక్ట్స్ వాడని వారు ఉండరు.  400 వందలకి పైగా ప్రొడక్ట్స్, 190 దేశాల్లో అమ్ముడుపోతున్నై. రోజుకి కనీసం 100 కోట్ల మందికి పైగా యూనిలివర్ ప్రొడక్ట్స్ ఒక్కటైనా వాడతారు.  ఇంగ్లాండ్ లో విలియం లివర్, జేమ్స్ లివర్ అనే ఇద్దరు అన్న దమ్ములు తమ తండ్రికున్న చిన్న గ్రోసరీ స్టోర్ లో పనిచేసేవారు.

తమకి తెలిసిన ఒక అతను యానిమల్ ఫ్యాట్ ప్రొడక్ట్స్ తో కాకుండా గ్లిసరిన్ కలిపిన సబ్బులు తయారు చేస్తుంటే అతనితో కలిసి "సన్ లైట్" అనే సబ్బు ని తయారు చేసి తమ షాపు లో అమ్మేవారు (1884). బాగా గిరాకీ ఉండటం తో లివర్ బ్రదర్స్ అనే కంపనీ 1885 లో పెట్టి ఇంగ్లాండ్ లోని వేరే ప్రాంతాలకి కూడా సన్ లైట్ సబ్బుని అమ్మేవారు. 1888 వ సంవత్సరం లో యూరప్ లోని మిగతా ప్రాంతాల వారు కూడా గ్లిసరిన్, పాల్మ్ ఆయిల్ తో చేసిన సన్ లైట్ సబ్బు ని ఎక్కువగా కొనేవాళ్ళు.

1895 లో కార్బాక్సిలిక్ యాసిడ్ కలిపి వీళ్ళు తయారు చేసిన సబ్బు ని అమెరికా వాళ్ళు చూసి మాకు కూడా కావాలి అన్నారు, ఆ సబ్బే "లైఫ్ భాయ్'. లైఫ్ బాయ్ సబ్బు లోని కార్బాక్సిలిక్ యాసిడ్ వాసన వలన లైఫ్ భాయ్ సబ్బు ప్రపంచం అంతా పాకింది. ఇంగ్లాండ్ కి చెందిన లివర్ బ్రదర్స్ 1929 లో నెదర్ల్యాండ్స్ కి చెందిన ఆహార పదార్ధాలు ఉత్పత్తి చేసే మార్గరిన్ కంపనీ తో కలిసి "యూనిలివర్" కంపనీ స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత విమ్ బార్, లక్స్, డోవ్, రిన్ సోప్, పెస్పిడెంట్ పేస్ట్, లిప్టన్ టీ, క్లోస్ అప్ టూత్ పేస్ట్, సర్ఫ్ ఎక్సెల్, బెన్ & జెర్రీ ఐస్ క్రీంస్, ఫెయిర్ & లవ్లీ, బ్రూ కాఫీ, బ్రూక్ బాండ్ , క్వాలిటీ వాల్స్, మాగ్నం ఐస్ క్రీం, అన్నపూర్ణ సాల్ట్, అన్నపూర్ణ పిండి, వీల్ డిటర్జంట్,  డొమెక్స్, లాక్మే, పాండ్స్, సన్ సిల్క్ షాంపూ, వాసిలిన్, పియర్స్ సోప్, రెక్సోనా, ఆల్ క్లియర్ షాంపూ.... ఇలా 400 బ్రాండ్స్ కి పైగా యూనిలివర్ ప్రొడక్ట్స్ ప్రపంచం లో 190 దేశాలకి పైగా అమ్ముడుపోతున్నై. 

పర్సనల్ కేర్, ఫుడ్, రెఫ్రెష్ మెంట్స్, హోం కేర్ రంగాలలో యూనిలివర్ దే ఆధిపత్యం. ఈ నాలుగు రంగాలలోని ప్రొడక్ట్స్ ఏ కంపనీవో తెలియకపోతే యూనిలివర్ అని చెప్తే 98% సమాధానం కరక్ట్ అవుతుంది. AXE  కూడా యూనిలివర్ వాళ్ళదే.  పెద్దగా చదువుకోని ఇద్దరు అన్నదమ్ములు ప్రారంభించిన యూనిలివర్ కంపనీ ప్రొడక్ట్స్ ప్రపంచం లోని మారుమూల ప్రాంతం లోని స్టోర్స్ లో కూడా అమ్ముడుపోతున్నై అంటే ప్రధాన కారణం రీచర్చ్. వాళ్ళకి బిజినెస్ డిగ్రీస్ లేవు, యూనివర్శిటీ లో చదువుకోలేదు. 

కాని ముగ్గురు కలిసి ప్రారంభించినప్పుడు కూడా ముగ్గుర్లో ఒకరు రీచర్చ్ చేసేవారు. ఒక సబ్బు లో గ్లిజరిన్, ఇంకో సబ్బు లో పాం ఆయిల్, ఇంకో దానిలో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇలా ప్రతి విజిటబుల్ ఆయిల్ తో కూడా తమ రీచర్చ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ కంపనీ కి సెపరేట్ రీచర్చ్ వింగ్ ఉంటుంది. అందుకే లివర్ బ్రదర్స్ ఎవరూ ఊహించనంత విజయం సాధించారు. 

ఈనాడు రామోజీరావు ఏమి చదువుకున్నాడు, ఏ బిజినెస్ స్కూల్లో చదువుకున్నాడు..? మై హోం రామేశ్వరరావు ఆక్స్ ఫర్డ్, IIMలో చదువుకున్నాడా..? లివర్ బ్రదర్స్, రామోజీరావు, రామేశ్వరరావు లాంటి వాళ్ళు సక్సెస్ అవటానికి కారణం వేరే వాళ్ళతో కలిసి పనిచేయటం. తమకి తెలిసిన దాని నుంచి తెలియనిది తెలిసిన వ్యక్తుల ద్వారా తెలుసుకోవటం. ఈ సామాన్య లక్షణమే యూనిలివర్ ని ఈ రోజు అగ్ర స్థానం లో నిలబెట్టింది. 

నాకు తెలిసినంత వరకు ప్రపంచం లో రెండే రకాల వ్యక్తులు ఉంటారు 1. వేరే వాళ్లతో కలిసి పనిచేసేవాళ్ళు 2. వేరే వాళ్లతో కలిసి పనిచేయని వాళ్ళు. కలిసి పనిచేసేవారు విజయం సాధిస్తారు, చేయని వారు సాధించరు. That's it.

-జగన్ రావు