రేపటి నుంచి గ్రామాల్లో 'ప్రత్యేక' పాలన

రేపటి నుంచి  గ్రామాల్లో 'ప్రత్యేక' పాలన

తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ఆగస్టు 1ను ముగియనున్నది. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఆదేశాలు, బీసీ గణన తదితర కారణాల వల్ల ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ వ్యవ‌హార‌మంతా పూర్తయ్యేస‌రికి కనీసం ఆరు నెలల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది.