తిరుపతి ఉప ఎన్నికల రణతంత్రం బీజేపీకి వర్క్ అవుట్ అవుతుందా...?

తిరుపతి ఉప ఎన్నికల రణతంత్రం బీజేపీకి వర్క్ అవుట్ అవుతుందా...?

ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటాయి పార్టీలు. ఓట్లను రాబట్టుకునేందుకు హామీల వర్షం గుప్పిస్తాయి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ భిన్నమైన లైన్‌ ఎంచుకుంది. దానిపైనే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్‌లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. 

బీజేపీ నేతల ప్రకటనలపై సర్వత్రా ఆశ్చర్యం!

ఇవి.. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు. జరుగుతోంది సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కాదు. సీఎంను నిర్థారించే ఎన్నిక కూడా కాదు. కానీ.. జనసేనానిని కాబోయే సీఎంగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు కమలనాథులు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  రత్నప్రభను ఇప్పటి నుంచే కేంద్రమంత్రిగా ఊహించుకునే పరిస్థితి కాషాయ శిబిరంలో కనిపిస్తోంది. ఆమెను గెలిపించండి.. కేంద్రమంత్రి అవుతారని ఊదరగొడుతున్నారు. ఇవన్నీ చూసిన రాజకీయ వర్గాలు  అసలు బీజేపీ నేతలకు ఏమైంది అని ప్రశ్నించుకునే పరిస్థితి ఉందట. 

జనసేన ఓటు బ్యాంకుపై ఆశలు!

తిరుపతి లోక్‌ ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. భారీ మెజార్టీనే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఉనికి కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది టీడీపీ. సత్తా చాటి.. ఏపీలో విజయ యాత్ర మొదలుపెట్టాలన్నది బీజేపీ ఆలోచన. జనసేన మద్దతు ఉండడంతో భారీగానే ఆశలు పెట్టున్నారు కమలనాథులు.  ఈ క్రమంలో ప్రయోగిస్తున్న అస్త్రాలే చర్చకు కారణం అవుతున్నాయి. 

పవన్‌ కల్యాణ్‌ బలమైన జాతీయవాదిగా ప్రకటన!

 జనసేనకు ఉండే ఓటు బ్యాంకు జారిపోకూడదని భావించారో ఏమో.. బరిలో ఉన్న అభ్యర్థి శక్తి సామర్థ్యాలను జనాలకు పరిచయం చేయడం మానేసి.. మిత్రపక్షం జనసేనాని గుణగణాలను పొడగటం మొదలుపెట్టారు. ఇప్పుడు బీజేపీ నేతలకు పవన్‌ కల్యాణ్‌లో ఒక జాతీయవాది కనిపించారు. తమ పార్టీలో కూడా అంతటి జాతీయ వాది లేరన్నట్టుగా నేతల కామెంట్స్‌ ఉంటున్నాయన్నది బీజేపీ శిబిరంలోనే చర్చ జరుగుతోంది.

బైట్- సునీల్‌ దేవదర్, బీజేపీ నేత

వైసీపీ నుంచి మొదలైన వ్యంగ్యాస్త్రాలు

సొంత పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు బయటకు కామెంట్‌ చేయకపోవచ్చు కానీ.. ప్రత్యర్థి పార్టీలు ఊరుకుంటాయా? ఓ రేంజ్‌లో తగులుకున్నాయి. వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు ఏపీ సీఎం అభ్యర్థికి  లింకేంటని తమదైన శైలిలో కాషాయ శిబిరంలోకి బాణాలు వదులుతున్నారు. 

ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారో గమనించడం లేదా?

తిరుపతి ప్రజలు లోక్‌సభ ఉప ఎన్నికలో ఈ నెల 17 తీర్పు ఇస్తారు. వాటి ఫలితాలు మే రెండో తేదీకి కానీ వెల్లడి కావు. కానీ.. ఇప్పటి నుంచే తమ అభ్యర్థిని కాబోయే కేంద్రమంత్రిగా ప్రొజెక్ట్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇలాంటి ప్రకటనలు పార్టీ కేడర్‌కు ఉత్సాహం తీసుకొచ్చినా.. ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారో పట్టించుకోవడం లేదట. ప్రత్యర్థి పార్టీలు డ్యామేజీ స్టేట్‌మెంట్లు ఇస్తున్నా లైట్‌ తీసుకుంటున్నారట. పైగా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా మా నేతల తీరు ఉందని చెవులు కొరుక్కుంటున్నాయట పార్టీ శ్రేణులు. ఎన్నికల్లో ఎవరి వ్యూహం వారికి ఉండొచ్చు. కానీ.. ఇదే ఎత్తుగడ అని  ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఎన్నికల రణతంత్రం బీజేపీకి  ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.