కరోనా ఎఫెక్ట్: స్పెయిన్ లో 24 గంటల్లో 2000 కొత్త కేసులు... 100 మరణాలు... 

కరోనా ఎఫెక్ట్: స్పెయిన్ లో 24 గంటల్లో 2000 కొత్త కేసులు... 100 మరణాలు... 

కరోనా వైరస్ యూరప్ దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది.  ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే, స్పెయిన్ లో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది.  స్పెయిన్ లో గత 24 గంటల్లో 2000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వందకు పైగా మరణాలు నమోదయ్యాయి.  దీంతో ఆ దేశం మొత్తం అలర్ట్ అయ్యింది.  

స్పెయిన్ లో వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.  ఇంత వేగంగా ఎలా వ్యాపిస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.  వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు దాదాపుగా 6వేలమంది వరకు మరణించడగా, రెండులక్షల మంది వరకు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.