స్పేస్ ఎక్స్: మళ్ళీ పేలిన రాకెట్... 

స్పేస్ ఎక్స్: మళ్ళీ పేలిన రాకెట్... 

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థకు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ రాకెట్ భూమిపై ల్యాండింగ్ జరిగే సమయంలో అనూహ్యంగా పేలిపోయింది.  టెక్సాస్ లోని బొకా చికా ప్రాంతంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.  స్పేస్ షిప్ ప్రొటోటైప్ 10 రకం రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.  ల్యాండింగ్ చేసిన తరువాత కూడా స్పేస్ షిప్ రాకెట్ నుంచి మంటలు రావడంతో ఈ ఘటన జరిగింది.  గతంలో ప్రొటోటైప్ 8, 9 లు కూడా ఇదే విధంగా పేలిపోయాయి.  అయితే, ఇప్పటికే ప్రొటోటైప్ 11 ను సిద్ధం చేసినట్టు సమాచారం.  అంగారకుడిపైకి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకొని స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ప్రయోగాలు చేస్తున్నది.