త‌మ్ముడి మీద ప్రేమ‌తో నిర్మాత‌గా మారిన బాలు..

త‌మ్ముడి మీద ప్రేమ‌తో నిర్మాత‌గా మారిన బాలు..

తెలుగు, త‌మిళ‌మే కాకుండా క‌న్నడంలోనూ ఆయ‌న పాడిన పాట‌కు ఎన్నో జాతీయ పురస్కారాలు ల‌భించాయి. త‌మ్ముడు క‌మ‌ల్ హాస‌న్‌కు చేతిలో సినిమాలు లేని స‌మ‌యంలో ఆయ‌న‌ మీదున్న ప్రేమ‌తో బాలు నిర్మాత‌గా మారారు. అలా తీసిని 'శుభ సంక‌ల్పం' ఎన్నో అవార్డుల‌ను తెచ్చి పెట్టింది. క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌, స‌ల్మాన్ ఖాన్‌, జెమిని గ‌ణేష‌న్ వంటి ప‌లువురు హీరోల‌కు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, న‌ట‌న‌తోనూ బాలు ప్రేక్షకుల‌ను క‌ట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు. తమిళ 'కేలడి కన్మణి'లో క‌థానాయ‌కుడి పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. త‌ర్వాత ప‌విత్ర బంధం, దేవుళ్లు, దేవదాస్‌, మిథునం వంటి ప‌లు సినిమాల్లోనూ న‌టించారు. 
ఎస్పీ బాలు స్పెషల్‌ అదే పాటకే ప్రాణం పోశాడు 
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం..తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా.. సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయననోట అలవోకగా జాలువారుతాయి. ఘంటసాల తరువాత ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు పొందిన ఏకైక గాయకుడు. హీరోల వాయిస్‌ తగినట్లు పాడడం ఆయన స్పెషల్‌. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు.