బ్రేకింగ్ : ఎస్పీ బాలు కండీషన్ సీరియస్

బ్రేకింగ్ : ఎస్పీ బాలు కండీషన్ సీరియస్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని తెలుస్తుంది. కరోనా సోకడంతో చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంటుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలు ఆరోగ్యం  విషమించినట్టు తెలుస్తుంది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి  ఆయన కుమారుడు ఎస్పీ చరణ్  సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు . అయితే కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. గత 40 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో బాలు ఆరోగ్యం పై డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. కోలుకుంటున్నారనుకున్న సమయంలో  బాలు తిరిగి  అ స్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది.