కరోనా నివారణకు కొత్త ప్రణాళకను కొరిన దక్షిణ కొరియా పీఎం

కరోనా నివారణకు కొత్త ప్రణాళకను కొరిన దక్షిణ కొరియా పీఎం

సియోల్: ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కబలిస్తోంది. కరోనాతో పోరాడేందుకు ప్రపంచ దేశాలు ఎనలేని కృషి చేస్తున్నాయి. అయితే కరోనా వచ్చిన మొదట లాక్‌డౌన్‌తో కొంత నివారించినా, లాక్‌డౌన్‌ను కొనసాగించడం ఏ దేశం చేయలేకపోయింది. అందుకు ఆర్థిక ద్రవ్యోల్భణం, నిదుల కొరత మొదలైన కారణాల కారణంగా లాక్‌డౌన్‌ను తొలగించాయి. దాంతో ప్రజలు ప్రతి పండగను వారి ఆచారాల ప్రకారం జరుపుకుంటునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం దక్షణ కొరియాలో ఇటువంటి పరిస్థితితే ఒకటి వచ్చంది. అతి దగ్గరలో ఉన్న హాలోవీన్ పండగను చూసి ఆ దేశ పీఎం చుంగ్ స్యేకున్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే హాలొవీన్ పండగ రోజున కరోనా విజృంభనను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతోపాటు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ను అదుచేయవచ్చు అనే అంశాన్ని వారు మాట్లాడుకున్నారు. ఈ పథకంలో భాగంగా హాలొవీన్ రోజున అన్ని రాకాల నైట్ క్లబ్స్‌ను మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ దక్షణ కోరియాలో 26,385 కరోనా కేసులు నమోదయ్యాయి.