ప్రమాదం లో క్రికెట్ సౌత్ ఆఫ్రికా భవిష్యత్తు...

ప్రమాదం లో క్రికెట్ సౌత్ ఆఫ్రికా భవిష్యత్తు...

క్రికెట్ సౌత్ ఆఫ్రికా భవిష్యత్తు ప్రమాదం లో పడింది. క్రికెట్ సౌత్ ఆఫ్రికా పై అంతర్జాతీయ బహిష్కరణ కత్తి వేలాడుతుంది. బోర్డులో అవకతవకలు, అనుచిత కార్యక్రమాలు, అవినీతి ఆరోపణలతో కుదేలైన దక్షిణ ఆఫ్రికా క్రికెట్ ఇప్పుడు మరో ప్రమాదంలో పడనుంది. ఇక నుండి క్రికెట్ వ్యవహారాలలో జోక్యం చేసుకోనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో సౌత్ ఆఫ్రికా బోర్డు పై ఐసీసీ వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం తమ సభ్యత్వ దేశాల క్రికెట్ విషయంలో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అలా చేస్తే ఐసీసీ ఆ దేశ బోర్డును అంతర్జాతీయ పోటీలనుండి భహిష్కరిస్తుంది. బోర్డులో అవినీతి ఆరోపణలతో గత ఆగస్టులో సౌత్ ఆఫ్రికా బోర్డు సీఈఓతో పాటు ఇతర అధికారులు కూడా రాజీనామా చేసారు. మరోవైపు బోర్డులో నిజంగానే అవినీతి జరిగినట్లు ప్రభుత్వం నియమించిన నిర్ధారణ కమిటీ తేల్చింది. దాంతో బోర్డు డైరెక్టర్లు అంత రాజీనామా చేయాలనీ సౌత్ ఆఫ్రికా క్రికెటర్ల సంఘం డిమాండ్ చేసింది. ఇప్పటికే 21 ఏళ్ళ పాటు వర్ణ వివక్ష కారణంగా బ్యాన్ ఎదుర్కొన క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు ఈ అవినీతి ఆరోపణలు తలనొప్పి తెస్తున్నాయి.