గంభీర్ కు దొరికింది నాకు దొరకలేదు : దాదా

గంభీర్ కు దొరికింది నాకు దొరకలేదు : దాదా

కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ కెప్టెన్‌గా  గౌతమ్ గంభీర్‌కు స్వేచ్ఛను ఇచ్చారని. కానీ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో తనకు అది లభించలేదని భారత మాజీ కెప్టెన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. దాదా 2008, 2010 లో కేకేఆర్ ‌కు నాయకత్వం వహించాడు. ఇక గౌతమ్ గంభీర్ 2011 ఐపీఎల్ ఎడిషన్‌లో గంగూలీ నుంచి ఆ బాధ్యతలు స్వీకరించి 2012 మరియు 2014 లో  జట్టును విజేతలుగా నిలిపాడు. గంగూలీ మాట్లాడుతూ... ఐపీఎల్ నాల్గవ సంవత్సరంలో షారూఖ్ ఖాన్ గౌతమ్ తో  'ఇది మీ జట్టు, నేను జోక్యం చేసుకోను' అని చెప్పిన ఇంటర్వ్యూను నేను చూశాను. అయితే మొదటి సంవత్సరంలో నేను అతనితో చెప్పాను. జట్టును నాకు వదిలేయండి అని, కానీ అప్పుడు అతను అలా చేయలేదు" అని గంగూలీ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉత్తమ ఐపీఎల్ జట్లు ఆటగాళ్లకు వదిలేశాయి. సిఎస్కే వైపు చూడండి, ఎంఎస్ ధోని దీన్ని నడుపుతున్నాడు. ముంబైలో కూడా రోహిత్ శర్మ వద్దకు ఎవరూ వెళ్లి ఏ ఆటగాళ్లను ఎన్నుకోవాలి అనేది చెప్పరు. వారికి స్వేచ్ఛ లభించింది" అని గంగూలీ అన్నారు.