నేను తెలుగు వారి అల్లుడిని: సోను సూద్

నేను తెలుగు వారి అల్లుడిని: సోను సూద్

సినిమాల్లో విలన్ అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలకు అతను మార్గం చూపించాడు. వారికి ఆహరం పెట్టడమే కాకుండా.. వారిని సొంత ఊర్లకు పంపే ఏర్పాట్లు చేశాడు. ఇటీవల పేద రైతులకు కూడా తన వంతు సాయం చేసాడు. అంతేకాదు చిన్నారులకు ఆపరేషన్ సహాయాలు, చదువులకు కావాల్సిన ఆర్థిక సాయాలు.. ఎలా ఏ అవసరం వచ్చిన సోను సూద్ గుర్తొస్తున్నాడంటే ఆయన అందిస్తున్న సహాయాలు అలాంటివి మరి. సోను సూద్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ ఐయ్యాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా 'అల్లుడు అదుర్స్' లో నటించాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో సోను సూద్ మాట్లాడుతూ.. 'నేను తెలుగు వారి అల్లుడినే.. నా భార్య తెలుగు అమ్మాయే' అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ విశేషాలేంటో ఈ క్రింది వీడియోలో చూసేయండి.