కంటతడి పెట్టుకున్న సోనూ...కారణమిదే.!

కంటతడి పెట్టుకున్న సోనూ...కారణమిదే.!

లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో సినిమా, టీవీ షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందీలో మోస్ట్ పాపులర్ షో అయ్యిన " ‘కపిల్ శర్మ షో" కూడా 120 రోజుల తరవాత తిరిగి ప్రారంభమయ్యింది. అయితే ఈ షో తిరిగి ప్రారంభించడంతో మొదటి ఎపిసోడ్ లో సోనూ సూద్ అతిధిగా పాల్గొన్నారు. ఈ షో శనివారం రాత్రి ప్రారంభం అయ్యింది. అంతే కాకుండా సోను సూద్ ఎపిసోడ్ కు భారీగా రేటింగ్ వచ్చింది. ఇక ఈ షో మధ్యలో సోనూసూద్ లాక్ డౌన్ వేళ తాను సహాయం చేసిన వలస కూలీలతో వీడియో కాల్ మాట్లాడారు. వారితో మాట్లాడుతున్న సమయంలో సోనూసూద్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. ఇక షో గురించి కపిల్ శర్మ ప్రత్యేకమైన ట్వీట్ చేసారు. సోనూసూద్ తో తీసిన ఎపిసోడ్ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సోనూ సూద్​ను ‘ది రియల్ హీరో ఆఫ్ 2020’ అంటూ కొనియాడారు.