నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సోనూ సూద్.. 

నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సోనూ సూద్.. 

 

సోనూ సూద్  లాక్ డౌన్ టైంలో చాలా మంది వలస కూలీలను ,పేద వాళ్ళని ఆదుకున్నాడు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో జనాల పట్ల రియల్ హీరోగా మారాడు. కష్టాల్లో వున్నా ప్రతివారికి కాదనకుండా సహాయం చేసాడు. కానీ కొంతమంది చాలా సిల్లీగా ప్రవర్తిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... తాజాగా ఓ నెటిజెన్ సోనూసూద్ కు ట్వీట్ చేస్తూ…. ‘మాల్దీవులకు వెళ్లాలని ఉంది. నాకు సాయం చెయ్యి బ్రో’ అంటూ పేర్కొన్నాడు. దానికి సోనూసూద్ కు కోపం వచ్చినట్టు ఉంది. ‘మాల్దీవులకి వెళ్లడానికి సైకిల్ కావాలా? రిక్షా కావాలా?’ అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చాడు. మొన్నటికి మొన్న ‘వి’ చిత్రం కోసం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కావాలని ఓ నెటిజెన్ అడిగితే.. ‘మెంబెర్ షిప్ సరిపోతుందా లేక టీవీ.. ఎసి కూడా కావాలా?’ అంటూ కౌంటర్ ఇచ్చాడు సోనూ సూద్.