మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్..
లాక్ డౌన్ వేళ వలస కూలీలకు సోనూసూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ మొదలైన నాటి నుండి సోనుసూద్ వలస కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తూనే ఉన్నాడు. అనేక మంది వలస కార్మికులకు నిత్యావసరాలు పంచడమే కాకుండా తన సొంత డబ్బులతో కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి బస్సులను కూడా ఏర్పాటు చేసాడు. దాంతో ఆయన సహాయం మర్చిపోలేనిదంటూ రాజకీయనాయకులు, ప్రజలు కొనియాడారు. ఇక తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు ఈ రియల్ హీరో. గుండె జబ్సుతో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేశారు సోనూసూద్. పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీల ఎనిమిది నెలల కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేకపోవడంతో సోనూసూద్ ట్రస్ట్‌ను ఆశ్రయించారు. వారి కష్టాన్ని అర్ధం చేసుకున్న సోనూ... బాలుడిని ముంబైలోని నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడికి గుండె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును అంతా తానే భరించారు. దీంతో సోనూసూద్‌పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)