ప్రధాని నిర్ణయానికి జైకొట్టిన సోనియా... కానీ రాహుల్ ఇలా... 

ప్రధాని నిర్ణయానికి జైకొట్టిన సోనియా... కానీ రాహుల్ ఇలా... 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వైరస్ కారణంగా ఇప్పటికే అనేక దేశాల్లో వేలాదిమంది మరణిస్తున్నారు.  ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది.  వైరస్ ను అడ్డుకట్ట వేయాలాలంటే లాక్ డౌన్ చేయడం ఒక్కటే మార్గం అని భావించిన ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.  మార్చి 24 వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అయ్యింది.  దీంతో ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోయారు.  

ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  కొంతవరకు కంట్రోల్ అయినట్టుగా కనిపిస్తోంది.  విపత్కర సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాలి.  సోనియా గాంధీ అదే చేసింది.  ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది.  లాక్ డౌన్ నిర్ణయం మంచిదే అని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ లేఖ రాసింది.  అయితే, రాహుల్ గాంధీ మాత్రం కేంద్రం లాక్ డౌన్ చేసే ముందు కార్మికుల గురించి రోజువారీ వేతనం పొందే వ్యక్తుల గురించి ఆలోచించలేదని, వారి వారి పరిస్థితి దారుణంగా ఉందని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.