జగన్ను తిడతారు.. వైసీపీలో చేరుతారు..
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ అవినీతిపరుడని తిట్టిన నేతలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మాట్లాడుతూ ఉనికి, భవిష్యత్తు కోసం ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతలు పార్టీ మారుతూ తమపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ హయాంలో జరగని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని సోమిరెడ్డి అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)