ఎమ్మెల్యేలను కొనడానికేనా గడువు..?

ఎమ్మెల్యేలను కొనడానికేనా గడువు..?

ప్రస్తుతం కర్ణాటకలో ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. బలపరీక్షలో గెలిచేందుకు జేడీఎస్-కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికే.. కర్ణాటక గవర్నర్ బీజేపీ ప్రభుత్వానికి 15 రోజుల గడువిచ్చారని ఆరోపించారు.. రెండు సంవత్సరాలుగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రికి అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు.. కానీ జగన్మోహన్ రెడ్డితో మాత్రం 45 నిమిషాల పాటు బెడ్‌రూంలో కూర్చొని మాట్లాడతారని ఆరోపించారు. టీడీపీ-బీజేపీ విడాకులు తీసుకుంటే తాము కాపురం చేస్తామని నంద్యాల ఎన్నికల సందర్భంగా బొత్స ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారని.. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రాదని సోమిరెడ్డి జోస్యం చెప్పారు.