రజినీకాంత్ సూపర్ గా ఎదగడానికి ఈ లక్షణాలే కారణమా? 

రజినీకాంత్ సూపర్ గా ఎదగడానికి ఈ లక్షణాలే కారణమా? 

రజినీకాంత్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదగడం వెనుక అయన పడిన కష్టం మాములుగా లేదు.  విపరీతంగా కష్టపడ్డారు.  చిన్నతనంలోనే తండ్రి మరణిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటూ చదువుకున్నారు.  ఉద్యోగం సంపాదించి కండక్టర్ గా పనిచేస్తూనే నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లి అక్కడ తర్ఫీదు పొందారు.  మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ.. విలన్ గా రాణించారు.  ఆ తరువాత భారవి సినిమాతో హీరోగా పరిచయమైన రజినీకాంత్... కె బాలచందర్ సినిమాల్లో వరసగా నటిస్తూ మెప్పించారు.  

ఇప్పటి వరకు రజినీకాంత్ 167 సినిమాల్లో నటించారు.  70 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ ఇంకా నటించే శక్తి ఉన్నది అంటే దానికి కారణం అభిమానులే అని అంటున్నారు.  తక్కువ తినడం, తక్కువ నిద్రపోవడం, తక్కువ మాట్లాడటం తక్కువ వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన ఇంకా నటించగలుగుతున్నానని అన్నారు.  రజినీకాంత్ లో భక్తితత్వం కూడా ఎక్కువే.  సినిమా పూర్తయ్యాక తప్పకుండా ఆయన హిమాలయాలకు వెళ్తారు.  అక్కడ సాధువులతో కలిసి హిమాలయ గుహల్లో తప్పస్సు చేసుకుంటారు.  మానసికంగా బలంగా ఉండేందుకు రజినీకాంత్ ఇవి ఉపయోగపడతాయని అంటున్నారు.  అదేవిధంగా సినిమా ఫెయిల్ అయ్యి బయ్యర్లు లాస్ అయితే, తన సొంత డబ్బును వెనక్కి ఇవ్వడం రజిని మంచితనానికి నిదర్శనం.  

తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన భైరవి నిర్మాత కళైజ్ఞానంకు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొని ఇచ్చారు.  అలానే రజినీకాంత్ సినిమాల విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు.  చెప్పిన సమయానికి షూటింగ్ కు ఖచ్చితంగా హాజరు అవుతారు.  అది షూటింగ్ కావొచ్చు మరొకటి కావొచ్చు.  సమయానికి రావడం ఆయనకు అలవాటు.  ఇవే గుణాలు ఆయన్ను సూపర్ స్టార్ ను చేశాయి.