అయోధ్య రామ మందిర నిర్మాణానికి రావణుడి గ్రామం నుంచి మట్టి... 

అయోధ్య రామ మందిర నిర్మాణానికి రావణుడి గ్రామం నుంచి మట్టి... 

నిన్నటి రోజున అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ అంగరంగవైభవంగా జరిగింది.  ఈ భూమి పూజ కోసం దేశంలోని వివిధ స్థలాల నుంచి, పూజ్యక్షేత్రాల నుంచి, పవిత్ర నదులు, సరస్సుల నుంచి మట్టిని, నీటిని అయోధ్యకు తీసుకొచ్చారు.  అయితే, రామాయణంలో విలన్ గా చెప్పబడే రావణుడి గ్రామం నుంచి కూడా మట్టిని అయోధ్యకు పంపించారు.  

రావణుడు అనగానే మనకు లంక నగరం గుర్తుకు వస్తుంది.  రావణుడు లంకను పరిపాలించినప్పటికీ, పుట్టింది మాత్రం ఇండియాలోనే అని పురాణాలు చెప్తున్నాయి.  నోయిడాకు సమీపంలో ఉన్న బిస్రాఖ్ గ్రామంలో రావణుడు జన్మించారని అక్కడి ప్రజలు చెప్తుంటారు.  అక్కడ రావణుడికి దేవాలయం కూడా ఉన్నది.  ఆయనకు అక్కడ నిత్యం పూజలు చేస్తుంటారు.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే రాత్రి సమయంలో కూడా ఆలయం తెరుచుకొని ఉంటుంది.  రావణుడి తండ్రి విశ్రావ ఆ గ్రామంలోనే తపస్సు చేశాడని, శివుడి నుంచి వరం పొందిన తరువాత రావణుడు జన్మించారని, రావణుడు కూడా అదే ప్రాంతంలో తపస్సు చేశారని అక్కడి ప్రజలు చెప్తుంటారు.  రావణుడు మంచివాడని, అధికారాలను దుర్వినియోగం చేయనంతటి వరకు రావణుడు సుగుణుడు అని, ఆ తరువాతే అతనిలో దుర్గుణాలు మొదలయ్యాయని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.  రావణుడి పుట్టిన ప్రాంతంగా చెప్పుకునే బిస్రాఖ్ గ్రామం నుంచి మట్టిని అయోధ్య భూమి పూజకు పంపించినట్టు రావణుడి ఆలయ పూజారి మహంత్ రామ్ దాస్ పేర్కొన్నాడు.