కృష్ణా జిల్లాలో పాముల కలకలం..నిన్న ఒక్కరోజే 9 మందికి పాముకాటు.!

కృష్ణా జిల్లాలో పాముల కలకలం..నిన్న ఒక్కరోజే 9 మందికి పాముకాటు.!

వర్షాకాలం వచ్చిందంటే కృష్ణ జిల్లాలో పాముల కలకలం మొదలవుతుంది. అవనిగడ్డ, పామర్రు,నాగాయలంక ప్రాంతాల్లో ఎక్కడ చూసినా విషసర్పాల సంచారం కనిపిస్తోంది. పాముల సంఖ్య పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం జూలైలోనే 95 మంది పాము కాటుకు గురికాగా, నిన్న ఒక్కరోజులోనే మొవ్వ పీహెచ్సీ  పరిధిలో 9 పాము కాటు కేసులు  నమోదయ్యాయి. దీంతో మరో మూడు నెలలపాటు పాముల సంచారం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కాగా పాముకాటుకు గురైన కొంతమంది నాటు వైద్యం చేయించుకుంటున్నారు. ప్రజలు నాటు వైద్యుల వద్దకు వెళ్లకూడదని దగ్గర్లో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని అధికారులు సూచించారు. యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.