పొగరాయుళ్లకు గుడ్‌న్యూస్‌..!

పొగరాయుళ్లకు గుడ్‌న్యూస్‌..!

ప్రంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి... ఓవైపు రకరాల పరిశోధనలు కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు.. కరోనాకు చెక్‌ పెట్టేందుకు వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వచ్చాయి.. ఇక, సీఎస్‌ఐఆర్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి... పొగరాయుళ్లు, శాఖాహారులకు కరోనా ముప్పు తక్కువని సీఎస్‌ఐఆర్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ఇక, అంతేకాదు.. ఏ బ్లడ్‌ గ్రూప్‌ వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉందనేదానిపై కూడా సీఎస్‌ఐఆర్ అధ్యయనం కొన్ని విషయాలను వెల్లడించింది.. ‘ఓ’ బ్లడ్‌గ్రూప్‌ వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం తక్కువని ఆ అధ్యయనం పేర్కొంది.. తన అధ్యయనంలో మొత్తం 10,427 మంది నమూనాలు పరీక్షించింది.. 10 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఇక ‘బీ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూప్ వారికి క‌రోనా త్వర‌గా సోకనున్నట్లు తేలిపింది ఆ అధ్యయనం. అలాగే కూరగాలను ఎక్కువగా తినేవారికి సైతం కరోనా ముప్పు తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇలా కరోనా వైరస్‌ గురించి రోజుకో అధ్యయనం.. రోజుకో విషయాన్ని ప్రకటిస్తూనే ఉంది. ఇక, కరోనాను పారద్రోలేందుకు ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. దేశ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.