పాక్ జట్టులో మళ్ళీ కరోనా కలకలం... మొత్తం ఆరుగురికి

పాక్ జట్టులో మళ్ళీ కరోనా కలకలం... మొత్తం ఆరుగురికి

ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న న్యూజిలాండ్ అనంతరం పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మేరకు బాబర్ ఆజాం నాయకత్వంలో మొత్తం 53 మంది ఆటగాళ్లు న్యూజిలాండ్ కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత క్వారంటైన్ లో ఉన్న ఆటగాళ్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. వారు కరోనా నిబంధలను పాటించనందుకే ఇలా జరిగింది అని ఆరోపించింది కివీస్. దానికి సంబంధించిన ఆధారాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలిపింది. అయితే మొదట పాక్ ఆటగాళ్లకు క్వారంటైన్ లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన కివీస్ బోర్డు ఇప్పుడు దానిని వెనక్కి తీసుకుంది. దీని పై పూర్తి విచారణ జరపనున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఇంతకముందు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా పాక్ జట్టులో కొంతమంది ఆటగాళ్ళు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.