పాజిటివ్ వ‌స్తే ఒక్క డోసు చాలా..? ప‌రిశోధ‌న‌లు చెబుతున్న మాట ఏంటి..?

పాజిటివ్ వ‌స్తే ఒక్క డోసు చాలా..? ప‌రిశోధ‌న‌లు చెబుతున్న మాట ఏంటి..?

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.. అయితే, చాలా వ‌ర‌కు ఆ వ్యాక్సిన్ల‌ను రెండు డోసులుగా తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.. తొలి డోస్, రెండో డోసుకు మ‌ధ్య నాలుగైదు వారాల గ్యాప్ ఉండాలి.. అయితే, ఒక వేళ క‌రోనా బారిన ప‌డికి ఒక్క డోసు చాలా? అంటే చాలు అని చెబుతోంది.. ఓ స్ట‌డీ.. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో వ్యాక్సిన్‌లు మార్కెట్‌లోకి వ‌స్తున్న స‌మ‌యంలో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్‌-సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో.. వ్యాక్సిన్ల‌పై అధ్య‌య‌నం చేశారు.. అయితే, ఆ అధ్య‌య‌నానికి సంబంధించిన ఆసక్తిక‌ర‌మైన ఫ‌లితాల‌ను తాజాగా విడుద‌ల చేశారు. 

ఇక‌, ఈ అధ్య‌య‌నంలో మొత్తం 1000 మంది పాల్గొన‌గా.. అందులో అప్ప‌టికే క‌రోనా వ‌చ్చి త‌గ్గిపోయిన వాళ్లు, ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ వైర‌స్ బారిన ప‌డ‌ని వాళ్లు కూడా ఉన్నారు.. అయితే, క‌రోనా వ‌చ్చిన త‌గ్గిపోయిన వాళ్ల‌కు ఒక్క డోసు టీకా ఇవ్వ‌గానే వాళ్ల‌లో రోగ‌నిరోధక శ‌క్తి చాలా పెరిగిన‌ట్టు తేల్చారు.. వైర‌స్ సోక‌ని వాళ్ల‌కు రెండు డోసులు ఇచ్చినా ఇంత మార్పులో వాళ్ల‌లో గుర్తించ‌లేద‌ని ఆ అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన సుసాన్ చెంగ్ తెలిపారు. తాము ఇలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఊహించ‌లేద‌న్నారు. అయితే, ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను న్యూ ఇంగ్లండ్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్ర‌చురించ‌డంతో.. ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం భార‌త్ తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా సాగుతోన్న‌త‌రుణంలో.. ఈ ఫ‌లితాలు ఆస‌క్తిక‌రంగా మారియి.