అంగరంగ వైభవంగా సునీత వివాహం...
సింగర్ సునీత వివాహం మ్యాంగో రామ్‌తో నిన్న హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయంలో జరిగింది. ఆలయ ప్రాంగనంలో జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం ప్రాంగనాన్ని పెళ్లిమండపంగా అద్భుతంగా తీర్చి దిద్దారు. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హీరో నితిన్‌లు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సునీత వివాహానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)