ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ కి 17 ఏళ్లు

ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ కి 17 ఏళ్లు

యంగ్ టైగర్  ఎన్టీఆర్, భూమిక జంటగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో 2003 జులై 09 న విడుదలైన మూవీ సింహాద్రి. ఎన్టీఆర్ లోని అసలు సిసలైన నటనను రాజమౌళి చూపించాడు. ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు ఉన్న రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేసింది.ఈ చిత్రంతో రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్ గా సింహాద్రి నిలిచింది. 247 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 167 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. 150 సెంటర్లలో 100 రోజులు ఆడింది. 52 సెంటర్లలో 175 రోజులు ఆడి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. నేటికి (జూలై 9) ఈ సినిమా విడులై 17 ఏళ్లయిన సందర్భంగా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ (రౌద్రంరణంరుధిరం) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది