మాజీ ప్రియుడితో హన్సిక మరోసారి !

మాజీ ప్రియుడితో హన్సిక మరోసారి !

ఒకప్పుడు ప్రేమికులుగా మెలిగిన శింబు, హన్సికలు చాలా కాలం ప్రేమాయణం కొనసాగించారు.  పెళ్ళికి కూడా సిద్ధమయ్యారు.  కానీ సయోధ్య కుదరక విడిపోయారు.  మళ్ళీ ఇద్దరూ కలిసి నటించనేలేదు.  బయట పలకరించుకున్న సందర్భాలు కూడా లేవు.  అలాంటిది ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించనున్నారు.   

హన్సిక 50వ చిత్రం 'మహా'.  ఈ సినిమాను జమీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.  సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం ఆయన శింబును సంప్రదించారట. శింబు కూడా హన్సికతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారట.  ఈ విషయాన్ని హన్సిక కన్ఫర్మ్ చేసింది.  మరి ఒకప్పటి ఈ మాజీ ప్రేమికుల  మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.