త్రిష ఆ హీరోని పెళ్లాడబోతుందా .?

త్రిష ఆ హీరోని పెళ్లాడబోతుందా .?

త్రిష పెళ్లి పీటలెక్కడానికి సిద్ధమవుతోందా.. ప్రొఫెషనల్‌లైఫ్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌ని కూడా సెట్‌ చేసుకుంటోందా అంటే అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. త్రిష ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్ అయినప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది. మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. అయితే ఈ బ్రేకప్‌లో బాధలో ఉన్న త్రిషకి శింబు కనెక్ట్‌ అయ్యాడట. ఈ కనెక్షన్‌ చాలా స్ట్రాంగ్‌ అయ్యిందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు కోలీవుడ్‌ జనాలు.శింబుకి కోలీవుడ్‌లో ప్లే బాయ్‌ ఇమేజ్‌ ఉంది. అప్పట్లో హీరోయిన్లు నయనతార, హన్సికతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అలాగే రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్యా రజనీకాంత్‌తో కూడా క్లోజ్‌గా మూవ్‌ అయ్యాడని చెప్తుంటారు. అలాంటి హీరో ఇప్పుడు త్రిషకి అతుక్కుపోయాడనే ప్రచారం జరుగుతోంది.
శింబు, త్రిష ఇద్దరినీ ఈ కరోనా లాక్‌డౌన్‌ కలిపిందట. పదేళ్ల కింద వచ్చిన "విన్నైతాండి వరువాయ' సీక్వెల్‌గా "కార్తీక్ డయల్‌ సెయిత ఎన్న్' అనే షార్ట్ ఫిల్మ్‌ వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ టైమ్‌లో వీళ్ల మధ్య ప్రేమ పుట్టిందని చెప్తున్నారు. ఓ జర్నలిస్ట్ ఇదే విషయాన్ని శింబు తండ్రి రాజేందర్‌ని అడిగితే సమాధానం చెప్పకుండా దాటేశాడు. రాజేందర్‌ నో కామెంట్స్‌ అన్నట్లు మాట్లాడ్డంతో శింబు, త్రిష పెళ్లి కన్ఫర్మ్ అంటున్నారు తమిళ జనాలు. అయితే పదిహేడేళ్ల క్రితం వచ్చిన "అలై' సినిమా టైమ్‌లోనే వీళ్లిద్దరు లవ్‌లో ఉన్నారనే టాక్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి వార్తలొస్తున్నాయి. మరి ఆల్రెడీ ఫార్టీకి దగ్గరైన ఈ లవ్‌ బర్డ్స్ ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటారా అన్నది చూడాలి.