రామమందిరం భూమిపూజలో ఐదు వెండి ఇటుకలు... ఎందుకంటే... 

రామమందిరం భూమిపూజలో ఐదు వెండి ఇటుకలు... ఎందుకంటే... 

అయోధ్య రామమందిరం భూమి పూజ ఆగష్టు 5 వ తేదీన ఘనంగా  నిర్వహించబోతున్నారు. రామమందిరం నిర్మాణం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది.  ఆగష్టు 3 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు మూడు రోజులపాటు పూజలు నిర్వహించబోతున్నారు.  ఆగష్టు 4 వ తేదీన రామానుజాచార్య పూజను నిర్వహిస్తారు.  ఇక ఆగష్టు 5 వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటలకు భూమిపూజ జరుగుతుంది.  ఆలయం గర్భగుడిలో ఏర్పాటు చేయబోతున్న ఈ భూమి పూజకు ఐదు వెండి ఇటుకలను ఉపయోగించబోతున్నారు.  హిందూ పురాణాల ప్రకారం ఐదు ఇటుకలు ఐదు గ్రహాలకు ప్రతీక.  అందుకే పూజకు వెండి ఇటులను వినియోగించబోతున్నారు.  ఇందులో మొదటి ఇటుకను ప్రధాని మోడీ  గర్భగుడిలో అమర్చనున్నారు.  ఇక అయోధ్య ఆలయ ట్రస్ట్ భూమి పూజకు మొత్తం 300 మందికి ఆహ్వానాలను పంపింది.