547 పరుగులు.. ఐపీఎల్ చెత్త రికార్డు

547 పరుగులు.. ఐపీఎల్ చెత్త రికార్డు

ఐపీఎల్-11 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ సిద్ధార్థ్ కౌల్ చెత్త రికార్డుని తన పేరిట లికించుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డును సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్-11 సీజన్‌లో సన్ రైజర్స్ తరుపున మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన సిద్ధార్థ్ కౌల్ 8.28  ఎకానమీతో 547 భారీ పరుగులు సమర్పించుకుని 21 వికెట్లు తీసాడు. భారీగా పరుగులు సమర్పించడంతో చెత్త రికార్డు సిద్ధార్థ్ కౌల్ పేరిట నమోదయింది. సిద్ధార్థ్ తర్వాతి స్థానంలో చెన్నై ఆల్ రౌండర్ బ్రేవో ఉన్నాడు. అతడు 16 మ్యాచ్‌లు ఆడి 533 పరుగులిచ్చాడు. 2013లో ఉమేశ్ యాదవ్ 508 పరుగులు, 2017లో మెక్లీన్‌గన్ 507 పరుగులిచ్చి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. అయితే ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సిద్ధార్థ్ కౌల్ మూడు ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. 

Photo: FileShot