గవాస్కర్ రికార్డు బ్రేక్ చేసిన గిల్...
ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో యువ ఆటగాళ్లు అంద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లోనే తన టెస్ట్ అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగుల తేడాలో సెంచరీ మిస్ అయినా.. 50 ఏళ్ల కిందటి ఓ రికార్డును గిల్ తిరగరాశాడు. ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు గల భారత ఓపెనర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గతంలో నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు రికార్డు టీమిండియా లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సన్నీ 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో 67 పరుగులు చేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)