అట్లీ సినిమాలో డ్యూయల్ రోల్ లో స్టార్ హీరో

అట్లీ సినిమాలో డ్యూయల్ రోల్ లో స్టార్ హీరో

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా సైరైన్ హిట్ లేక సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్ సినిమా నిరాశపరచడం తో కొంత గ్యాప్ తీసుకున్నాడు షారుక్. ఈ సారి కథ విషయంలో దర్శకుడి విషయంలో చాలా జాగ్రత్తలు వస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ డైరెక్టయిం లో షారుక్ ఓ సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేయడం కొత్తేమి కాదు. బాలచందర్, బాలు మహేంద్ర, శంకర్, మురుగదాస్, బాల ఇలా ఎందరో కోలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించారు.  ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇక అట్లీ విషయానికొస్తే కోలీవుడ్ లో రాజారాణి, తేరి, మెర్సల్, ఇప్పుడు బిగిల్ సినిమాలు చేశాడు.  ఈ నాలుగు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  బిగిల్ సినిమాకు బాలీవుడ్ ఫిదా అయ్యింది.  దాంతో షారుక్ పిలిచిమరీ అట్లీ కి సినిమా ఇచ్చాడని టాక్ . అయితే ఈ సినిమాలో షారుక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఇందులో షారుక్ ఒక పాత్రలో ఇన్వస్టిగేషన్ ఆఫీసర్ గా మరో పాత్రలో క్రిమినల్ గా కనిపించనున్నాడని బాలీవుడ్ వర్గాలనుండి అందుతున్న సమాచారం. దీనితో పాటు యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పఠాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు షారుక్ . ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.