టాలీవుడ్ లో రీమేక్ కానున్న మరో హర్రర్ కామెడీ మూవీ
హర్రర్ జానర్ సినిమాలకు ఎప్పుడు లైఫ్ ఉంటుంది. సినిమాను అనుకున్నట్టుగా థ్రిల్లింగ్ గా చూపించగలిగితే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. తప్పకుండా సినిమా చూస్తారు. ఈ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినా చూస్తూనే ఉంటారు. బడ్జెట్ కూడా తక్కువే.
తెలుగులో అనేక హర్రర్ కామెడీ సినిమాలు వచ్చాయి. ఇటీవలే బాలీవుడ్ లో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా స్త్రీ అనే సినిమా రిలీజ్ అయింది. రూ.15 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.92 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 2018లో బాలీవుడ్ లో సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
1980-90 దశకంలో దక్షణభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో ఒక మూఢనమ్మకం అధికంగా ప్రచారంలో ఉండేది. అప్పట్లో ఏ ఇంటి గోడలమీద చూసినా ఓ స్త్రీ రేపురా అని రాసుంటుంది. ఇలా ఎందుకు రాశారో.. ఎవరికీ తెలియదు. గ్రామంలోకి రాత్రిపూట దెయ్యాలు వస్తాయని.. ఇంటి తలుపులు బాదుతాయని, ఎవరైన వచ్చి తలుపు తెరిస్తే వారిని ఎత్తుకుపోతాయని ప్రచారం జరిగింది. ఈ సంఘటనలను ఆధారం చేసుకొని తెలుగువారైన రాజ్, డికే అనే ఇద్దరు స్క్రిప్ట్ తయారు చేసి బాలీవుడ్ లో సినిమా చేశారు. ఇది అక్కడ వర్కౌట్ కావడంతో.. దీనిని ఇప్పుడు టాలీవుడ్ లో రీమేడ్ చేయబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తారట.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)