గ్రీన్ ఇండియా ఛాలెంజ్ :  మొక్కలు నాటిన  బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ :  మొక్కలు నాటిన  బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా కొనసాగుతుంది దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చిఈ కార్యక్రమంలో పాల్గొని సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. 
బాహుబలి స్టార్ ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా  ఫేస్ బుక్ ద్వారా తెలిపింది . ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి  శ్రద్ధా కపూర్ ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపింది.