ఆవును తుపాకీతో కాల్చి చంపింది సానియానే...

ఆవును తుపాకీతో కాల్చి చంపింది సానియానే...

వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఇంచార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఉమర్ కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీశారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సానియా మీర్జా ఫామ్‌హౌస్‌లో స్వయంగా ఆమెనే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో స్థానిక పీఎస్‌లో కేసు కూడా నమోదు అయిందని తెలిపారు. గోమాతపై జరిపిన కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.