వికారాబాద్ కిడ్నాప్ కేసు శుఖాంతం.. ఇష్టంతోనే వెళ్లిందట !

వికారాబాద్ కిడ్నాప్ కేసు శుఖాంతం.. ఇష్టంతోనే వెళ్లిందట !

వికారాబాద్‌ లో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసులో పురోగతి సాదించారు పోలీసులు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న దీపిక షాపింగ్‌కి వెళ్లొస్తూ కిడ్నాప్‌కి గురైన విషయం తెలిసిందే. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు మొత్తం ఏడు టీమ్‌లను ఇప్పటికే రంగంలోకి దించారు. అయితే తాను ఇష్ట పూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లిపోయానంటూ ఆమె ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. వికారాబాద్ పోలీసులకి ఫోన్ చేసి తాను తన భర్త వద్ద క్షేమంగానే ఉన్నానని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే పోలీసులు వారిరువురినీ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ కి రమ్మని కోరారు. దీంతో వారు కాసేపట్లో అక్కడికి రానున్నారు. నాలుగేళ్ల కిందట 2016లో దీపిక, అఖిల్ లు మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు రెండేళ్ల కిందట యువతిని ఇంటికి తీసుకొచ్చేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్దమయింది. ఈ కేసు గురించి వికారాబాద్‌ కోర్టుకి హాజరైన రోజే దీపికను కారులో ఎత్తుకు వెళ్ళడం, ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో కలకలం రేగింది. అయితే ఆమె పోలీసులు అనుమానించినట్టే షాకిచ్చింది.