తన భార్య సానియా మీర్జా ను కలిసేందుకు షోయబ్ కు అనుమతిచ్చిన పీసీబీ...

తన భార్య సానియా మీర్జా ను కలిసేందుకు షోయబ్ కు అనుమతిచ్చిన పీసీబీ...

కరోనా కారణంగా ఐదు నెలలుగా కలుసుకోని తన కుటుంబంతో కొంత సమయం గడిపి ఆలస్యంగా ఇంగ్లండ్‌లోని పాకిస్తాన్ జట్టులో చేరడానికి ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్‌కు అనుమతిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. మిగతా వారిలా కాకుండా, షోయబ్ మాలిక్ దాదాపు ఐదు నెలలుగా తన కుటుంబాన్ని చూడలేదు అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ తెలిపారు. అయితే ప్రయాణ ఆంక్షలు ఇప్పుడు నెమ్మదిగా సడలిపోతున్నందున అతని భార్యతో కలిసి కొంతకాలం గడిపేందుకు మానవతా దృష్టితో అనుమతిస్తున్నాము అని అన్నారు.  కరోనా లాక్ డౌన్ సమయం లో మాలిక్ పాకిస్తాన్‌లో ఉండగా, అతని భార్య, టెన్నిస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా మరియు అతని కుమారుడు ఇజాన్ భారతదేశంలో ఉన్నారు. అయితే మాలిక్, టెస్ట్ మరియు వన్డే నుండి రిటైర్ అయిన టీ 20 ఫార్మాట్ లో కొనసాగుతున్నాడు. పాక్ జట్టు మొత్తం జూన్ 28 న ఇంగ్లాండ్ కు బయలుదేరగా మాలిక్ మాత్రం కొంత ఆలస్యంగా వెళ్లి జట్టులో చేరుతాడు.