దాదాను ప్రశంసిస్తూ భారతీయులను ఆశ్చర్యపరిచిన అక్తర్...

దాదాను ప్రశంసిస్తూ భారతీయులను ఆశ్చర్యపరిచిన అక్తర్...

ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ వాయిదా నుండి పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టుపైన తరచు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడి ఆ విండోలో ఐపీఎల్ జరుగుతుండటంతో అవి ఇంకా ఎక్కువయ్యాయి. అయితే అలా విమర్శలు చేయడంలో పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ముందుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం భారత మాజీ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షడు సౌరభ్‌ గంగూలీని ప్రశంసిస్తూ భారతీయులను ఆశ్చర్యపరిచాడు అక్తర్. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో గంగూలీతో తాను కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసాడు. దానికి ''నేను ఏదైనా వ్యతిరేకతను స్వాగతించాను. అందుకే ఏ జట్టుతోనైనా పోటీపడేందుకు నేను సిద్దంగా ఉంటాను. ప్రత్యర్థులను కట్టడి చేయడమంటే నాకు ఇష్టం. అయితే నాకు గంగూలీని ఎదుర్కోవడం మాత్రం చాలా కష్టం అనిపించింది. అతను గొప్ప ప్రత్యర్థి మాత్రమే కాదు గొప్ప నాయకుడు కూడా... నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌కు అతని కెప్టెన్సీలోనే ఆడాను అని తెలిపాడు.