నేను కోహ్లీని పొగిడితే మీకేంటి ప్రాబ్లమ్...?

నేను కోహ్లీని పొగిడితే మీకేంటి ప్రాబ్లమ్...?

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీరు చాలా వింతగా ఉంటుంది. ఒక్కోసారి భారత ఆటగాళ్లను ప్రశంసిస్తూ ఉంటాడు. మరోసారి విమర్శిస్తుంటాడు. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ వాయిదా నుండి పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టుపైన తరచు విమర్శలు చేస్తూనే ఉన్నారు. టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడి ఆ విండోలో ఐపీఎల్ జరుగుతుండటంతో అవి ఇంకా ఎక్కువయ్యాయి. అయితే అలా విమర్శలు చేసినవారిలో అక్తర్ కూడా ఉన్నాడు. కానీ తాజాగా అతను భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగడటంతో స్థానికంగా అక్తర్ పై విమర్శలు వచ్చాయి. కానీ వారికి గట్టి బదులు ఇచ్చాడు అక్తర్. కోహ్లీని ప్రశంసించడం తప్పు బడుతూ ఓ పాక్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. భారత కెప్టెన్ ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అని చెప్పిన అక్తర్ అతని రికార్డులే ఆ విషయాన్ని చెప్తాయి అని స్పష్టం చేసాడు. పాక్ క్రికెట్ లోనైనా ప్రపంచ క్రికెట్లోనైనా అతడిలా ఆడే బాట్స్మెన్ ఎవరు ఉన్నారు అని ఎదురు ప్రశ్న వేసాడు. అందుకే భారత సారథి ప్రశంసలకు అర్హుడు అని అక్తర్ తెలిపాడు. అలాంటప్పుడు తాను విరాట్ ను పొగిడితే తప్పేంటి అని నిలదీసాడు. కోహ్లీ కేవలం భారత ఆటగాడు కాబట్టే ఈ విమర్శల అని అక్తర్ అడిగాడు.