17 నిమిషాల్లో బాబ్రీని కూల్చేశాం..

17 నిమిషాల్లో బాబ్రీని కూల్చేశాం..

శివసేన నాయకుడు సంజయ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము 17 నిమిషాల్లోనే బాబ్రీమసీదును కూల్చేశామని, రామమందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ తేవడానికి ఎంత సమయం కావాలంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి భవన్ నుంచి యూపీ దాకా బీజేపీ సర్కారే ఉందని, అయినా మందిర్ విషయంలో బీజేపీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 

రాజ్యసభలో కూడా చాలామంది మందిర్ ను సమర్థించేవారున్నారని, ఇక మందిర్ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించేవారు దేశంలో తిరిగే పరిస్థితులు ఉండవని మరో ఘాటు వ్యాఖ్య చేశారు. కోర్టు ద్వారా గానీ, పార్లమెంట్ ద్వారాగానీ తాము శాంతియుతంగానే సమస్య పరిష్కరించుకోవాలని చూస్తున్నామన్నారు. 25వ తేదీన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యకు బయల్దేరుతున్నారు.