లాక్ డౌన్ తర్వాత  ధావన్, జడేజా కలిసి ఆ పని చేస్తారట...!

లాక్ డౌన్ తర్వాత  ధావన్, జడేజా కలిసి ఆ పని చేస్తారట...!

భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రపు స్వారీ పట్ల ఉన్న అభిరుచి అతని అభిమానుల అందరికి తెలుసు. ఈ సౌరాష్ట్ర బ్యాట్స్మాన్ తన గుర్రపు స్వారీ నైపుణ్యాలను చూపించే తన ఫోటోలు మరియు వీడియోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. అయితే కరోనావైరస్ క్రీడా ప్రపంచాన్ని నిలిపివేసింది. అయితే మంగళవారం, జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన గుర్రాలతో మరో ఫోటోను షేర్ చేసాడు. అలాగే "నా గుర్రం నా గురించి తెలుసుకోవలసిన ప్రతిదాన్ని నాకు నేర్పుతుంది" అని తెలిపాడు. అయితే ఈ పోస్ట్ కు స్పందించిన భారత ఓపెనర్ శిఖర్ కరోనావైరస్ మహమ్మారిని అదుపులోకి తెచ్చుకున్న తర్వాత మిమ్ము ఇద్దరం  గుర్రపు స్వారీ చేస్తామని తెలిపాడు. భారతదేశం ప్రస్తుతం 21 రోజుల పూర్తి లాక్ డౌన్ లో ఉంది. ఇది ఏప్రిల్ 14 వరకు అమలులో ఉంటుంది. అయితే ఇప్పటివరకు మన దేశం లో కరోనా పాజిటివ్ కేసులు 5,351 నమోదుకాగా మరణించిన వారి సంఖ్య 160 కి చేరుకుంది.