సన్ రైజర్స్ కు శిఖర్ ధవన్ గుడ్ బై?

సన్ రైజర్స్ కు శిఖర్ ధవన్ గుడ్ బై?

భారత క్రికెటర్ శిఖర్ ధావన్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ కు గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు యాజమాన్యంపై అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరుపున బరిలోకి దిగాలని అనుకుంటున్నాడు. ఈ విషయంపై ఆ జట్టు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాడట. ఇదే సమాచారాన్ని సన్ రైజర్స్ యాజమాన్యానికి అందించినట్లు తెలుస్తుంది. శిఖర్ ధావన్ నిర్ణయంపై సన్ రైజర్స్ యాజమాన్యం స్పందించింది. తమకు మంచి ఆటగాళ్లు దొరికే అవకాశం ఉంటే ఆటగాళ్లను ఇతర ప్రాంఛైజీకు బదిలీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.